MOU | ఆర్‌టీఐహెచ్-పీబీ సిద్దార్థ కళాశాల మధ్య ఎంవోయూ..

ఆవిష్కరణల ఆధారిత విద్యాభాగస్వామ్యానికి చొరవ
MOU | పటమట, ఆంధ్రప్రభ : ఆవిష్కరణల ఆధారిత విద్యా భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)-విజయవాడ, పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (PB Siddhartha Arts and Science College) మధ్య మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ సందర్భంగా ఆర్‌టీఐహెచ్-విజయవాడ సీఈవో జి.కృష్ణన్ కళాశాలలో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయసహకారాలు ఆర్‌టీఐహెచ్ ద్వారా అందుతాయన్నారు.

కొత్త ఆవిష్కరణలు దిశగా విద్యార్థులను ప్రోత్సహించడం, సరైన మార్గనిర్దేశనం అందించడం, శిక్షణ కార్యకలాపాలు తదితరాలకు ఈ ఎంవోయూ దోహదం చేస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత అయిన ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త దార్శనికతను యువత సరైన విధంగా అర్థంచేసుకొని.. ఆంత్రప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగేయాలన్నారు. ఆర్‌టీఐహెచ్ (RTIH) అందిస్తున్న మద్దతను, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్ సంస్కృతిని, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు విద్యాసంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు.
