collector| రైతులను ఆదుకోవాలి..

collector| రైతులను ఆదుకోవాలి..

  • వైసీపీ నేతలు

collector| అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా రైతులను ఆదుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ ను వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తదితరులు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు సాగుచేసిన అరటి పంటకు ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇదేవిధంగా మొక్కజొన్న పంటకు ధర లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులు సాగు చేసిన పంటలకు గిట్టుబాటులేకపోయినప్పటికీ మార్కెట్లో వినియోగదారులు అత్యధిక ధరలకు అన్ని రకాల వస్తువులు కొనాల్సి వస్తుందని తెలిపారు. కూరగాయల ధరలు అధికంగా పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

Leave a Reply