Telangana| ఆర్థిక సాయం..

Telangana | ఆర్థిక సాయం..
Telangana | ఆర్థిక సాయం..బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన నెమలి భూషణం సోమవారం అకాల మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (MLA Gampa Govardhan) దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆయన ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం పదివేల రూపాయలు పంపించారు. వాటిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపాల్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ బిక్షపతి, గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధిరామిరెడ్డి, నాయకులు మల్లేశం స్వామి తదితరులు పాల్గొన్నారు.
