JaganCoterie | ఏ పార్టీలోనూ చేరను…

Jagan Coterie | ఏ పార్టీలోనూ చేరను…
- అనివార్యమైతే ఆలోచిస్తా
- జగన్ కోటరీ వల్లే
- దూరమయ్యాను
- జనసేనలో చేరను
- మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన చుట్టూ ఉన్న దూరంగా పెట్టి పార్టీని ముందుకు నడిపిస్తే ఫలితం ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు విజయ సాయి రెడ్డి (Ex MP Vijaya Sai Reddy) అన్నారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దగ్గరలోని అంపోలు (Alaprolu) వద్ద విజయసాయిరెడ్డి సొంత నిధులతో నిర్మించనున్న రెడ్డి సామాజిక వర్గ భవనానికి (Reddy Bhavan) ఆయన శంకుస్థాపన (Foundation Stone) చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తనను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆహ్వానించలేదని తెలిపారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోకి చేరే ఆలోచనలో తాను లేనని అన్నారు. అవసరమైతే తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( pawan kalyan) తనకు 20 ఏళ్లుగా బాగా తెలుసునని, నాకు మంచి మిత్రుడని (Best Friend) తెలిపారు. అయినంత మాత్రాన తాను జనసేన పార్టీలోకి (Don’t join in janasena) వెళుతున్నానన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ చుట్టూ ఉన్న కోటరీ ( Jagan coterie) కారణంగానే తాను పార్టీకి జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీకి దూరమయ్యానని వివరించారు అయితే అధికారం లేనప్పుడు కూడా కోటరీ సలహాలతోని ఆయన వెళ్తున్నారని అన్నారు. నిబద్ధత గల నాయకుల మాటలు వింటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాకు స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి పేరు పెడితే మంచిదని అయన కూటమి ప్రభుత్వానికి సూచించారు.
