Explosion : అది అన్ అఫీషియల్

Explosion : అది అన్ అఫీషియల్


20 రోజులుగా ఖాళీ
విచారణలో అధికారులు బిజీబిజీ

పల్పాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రంలోని పాల్వాయి జంక్షన్ లో అనధికారిక బయో డీజిల్ పెట్రోల్ (Bio Desel Bunk) బంక్‌లో ఆదివారం తెల్లవారు జామున ఘోర ప్రమాదంలో ఒకరు సజీవదహనం కాగా.. మరొకరు చావు బతుకుల్లో ఉన్నారు. సుమారు 20 రోజులుగా (20 Days No stock) ఈ బంకులో డీజిల్ లేదు. ఈ బంక్ ఖాళీగా ఉంది, ఆదివారం ఉదయం డీజిల్ వచ్చింది. బంకును తెరచి అన్ని యంత్రాలను (Sunday bunk opened) ప్రారంభిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి బంక్ మొత్తాన్ని చుట్టుముట్టాయి.ఈ ప్రమాదంలో గురజాల ప్రాంతానికి చెందిన రషీద్ మంటల్లో ( Rashid Dead Alive) చిక్కుకుని దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉదయం 6:30 గంటల సమయంలో ప్రమాద స్థలికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అనధికారికంగా బంకును ( Un Official) నిర్వహించారనే అంశంపై కూడా అధికారులు విచారణ ప్రారంభించారు.

Leave a Reply