MEETING| బహిరంగ సభను విజయవంతం చేయండి..

MEETING| లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ: డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ ) 100 సంవత్సరాల భారీ బహిరంగ సభను మేధావులు, విద్యావంతులు,అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపకుండా బూటకపు ఎన్ కౌంటర్ లతో మరణాహోమాన్ని సృష్టిస్తుందన్నారు.

అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కాలం గడుపుతోందని విమర్శలు గుప్పించారు. దోపిడీ, పెట్టుబడి దారి విధానాలకు సీపీఐ వ్యతిరేకమని వివరించారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశం లో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వనం సత్యం, సీపీఐ మండల కార్యదర్శి మేదరి దేవవరం,నాయకులు అవునూరి వెంకటేష్, స్వామి, వాణీ, బన్నీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply