MAOISM | పంతం మార్చుకోవాలి..

MAOISM | పంతం మార్చుకోవాలి..

MAOISM | ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశం నేడు ప్రపంచంలో అభివృద్ధి వైపు దూసుకొని పోతున్న తరుణంలో మావోయిస్టులు నక్సలైట్లు అనుసరిస్తున్న విధానాలవల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని నారాయణపేట జిల్లా (Narayanapeta District) సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. వారు లొంగిపోయిన కేంద్ర,రాష్ట్ర మావోయిస్టుల, నక్సలైట్ల మాదిరిగా జనజీవన స్రవంతిలోకి వచ్చి బడుగు బలహీనవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు.

దేశంలో,రాష్ట్రంలో మావోయిస్టులపై జరుగుతున్న ఎన్ కౌంటర్లను వ్యతిరేకించే వారు పోలీసు అధికారులను, పోలీసు బలగాలను ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు, నక్సలైట్లు (Naxalites) చంపితే ఎందుకు మౌనం పాటిస్తారో తెలియచేయాలని అన్నారు. నారాయణ పేట జిల్లాలో దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి,వారి కొడుకు చిట్టెం వెంకటేశ్వర రెడ్డి ని చంపిన నక్సలైట్ లు ఏమి సాధించారో తెలుపాలని అన్నారు. ప్రపంచంలోనే మహోయిజం,నక్సలిజం అంతరించి పోయిందని అన్నారు. భారత దేశంలో హింసకు తావు లేదని మావోయిస్టులు, నక్సలైట్లు వారి యొక్క పంథం మార్చుకొని పేద ప్రజల ఉన్నతి కోసంరాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలనికోరారు.

Leave a Reply