Tirumala | శ్రీవారి ఆలయ పైకప్పు మరమ్మతులకు శ్రీకారం
తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది. ఆలయ ప్రాకారంలోని పలు మండపాలు, ఉప ఆలయాలు…లడ్డూలు, అన్నప్రసాదాలు తయారు చేసే పొటు లు నిర్మాణం జరిగి వేల సంవత్సరాలు కావడంతో వాటి పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తోంది…
ప్రధానంగా పొటులో వర్షపు నీరు లీకేజీ వల్ల ప్రసాదాల తయారీలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ క్రమంలో గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి చైర్మన్ బీఆర్ నాయుడు తీర్మానం చేశారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు..