Vivekanda Murder case : సీఐ నీరుగార్చాడు
- సాక్ష్యాలు తారుమారు అతడి పనే ..సీబీఐ నివేదిక
- అందుకే ఉద్యోగం ఊడింది
( కడప , ఆంధ్రప్రభ బ్యూరో)
ఔను .. ఆరేళ్ల కిందట ఆయన పులివెందుల సీఐ (Pulivendula CI). వైఎస్ వివేకానంద హత్య జరిగిన నేర స్థలికి చేరిన తొలి దర్యాప్తు అధికారి ఈయనే. తొలుత గుండెపోటుతో వివేకానంద రెడ్డి మృతి చెందారనే సమాచారం లీకు చేసింది ఈయనే. క్రైమ్ సీన్ (Crime Scene Change) మార్పిడిలో కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించే రీతిలో ఆయన విధినిర్వహణ వెలుగులోకి వచ్చింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో.. సస్పెన్షన్.. వీఆర్.. స్థాయి నుంచి సర్వీసు నుంచి బర్తరఫ్ (Dismiss ) స్థాయికి దిగజారారు. ఆయన సీఐ జె.శంకరయ్య. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Vivekananda Reddy Murder Case) దర్యాప్తును తప్పుదోవ పట్టించారని ఆరోపణలు మూటగట్టుకున్నారు. సీఎం చంద్రబాబుపై పరువు నష్టం దావా (Defamation) దాఖలు చేశారు.
ఈ స్థితిలో.. శంకరయ్యపై చివరకు ఉద్వాసన వేటు పడింది. శాఖాపర విచారణ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఆయనను శాశ్వతంగా పోలీసు సేవల నుంచి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.2019 మార్చి 15న పులివెందులలో లో జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో క్రైమ్ సీన్ తారుమారు చేశారని, మృతదేహంపై గాయాలను దాచిపెట్టారని, ఎఫ్ ఐ ఆర్ నమోదులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని, కుటుంబ సభ్యులు సూచించిన పేర్లను నమోదు చేయకుండా కేసును వేరే దిశకు మళ్లించారని సిబిఐ విచారణలో బయటపడ్డాయి.
హత్య జరిగిన తొలి గంటల్లోనే హార్ట్ అటాక్ (Heart Attack Story) కథనం బయటకు పంపించడం,మృతదేహాన్ని త్వరగా తరలించేందుకు ఒత్తిడి చేయడం, సాక్ష్యాలను చెదరగొట్టేలా చర్యలు చేయడంశంకరయ్య చేసిన తప్పులుగా సిబిఐ రిపోర్టులో పేర్కొంది. సీబీఐ నివేదిక (CBI Charge Sheet) ప్రకారం అప్పటి పులివెందల సీఐశంకరయ్య చర్యలు విచారణకు తిరిగిరాని నష్టం కలిగించాయని స్పష్టం చేసింది.
Vivekanda Murder case సస్పెన్షన్ నుండి బర్తరఫ్ వరకు
వివేకా హత్య కేసులో అనుమానాస్పద పాత్ర వెలుగులోకి రాగానే శంకరయ్యను ఒక దశలో పోలీసులు సస్పెండ్ చేసినా తర్వాత ఆయనను ప్రభుత్వం ఆయనను వీఆర్ లో ఉంచింది. కానీ తాజా గా ప్రభుత్వం వివేక హత్య కేసు ఫైలును మళ్లీ పరిశీలించగాఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, విచారణను ప్రభావితం చేసే చర్యలు రుజువవడంతో ఆయనను పర్మనెంట్‌గా బర్తరఫ్ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు వెలువరించింది.
Vivekanda Murder case తాజాగా సీఎం పై నోటీసు
ఇటీవలే శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రూ.1.45 కోట్లు పరువు నష్టం నోటీసు ఇచ్చి వివాదాస్పదుడయ్యారు. శాఖాపర విచారణలో ఆయనపై వచ్చిన ఆధారాలు బర్తరఫ్ నిర్ణయానికి దారితీశాయి. వివేకా కేసులోఇప్పటికే ప్రధాన నిందితులపై చార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది. హత్య దర్యాప్తును అడ్డుకున్న అధికారిపై చర్య పూర్తికావడంతో, కేసు ట్రయల్ మరింత వేగం పుంజుకునే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

