Tears Farewell : ఎర్రజెండా కన్నీరు
- జోగారావుకు విప్లవ జోహార్లు
- ప్రజాసంఘాలు అరుణాంజలి
- కళాకారుల పాటలు కంటతడి
- పోలీస్ ఆంక్షలు యథాతథం
- బాతుపురం జన సంద్రం
- సాగర తీరం లో
- టెక్ శంకర్ కు దహన సంస్కారం
ఆంధ్రప్రభ, పలాస (శ్రీకాకుళం) :

ఆంధ్రా -ఒడిశా సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో రెండు రోజులు కిందట జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ (Tch Shankar) అంతిమ యాత్రలో ఉత్తరాంధ్ర జనం కన్నీటి వీడ్కోలు (Tearfull Farewell) పలికారు. జోగారావుకు తుది వీడ్కోలు పలికేందుకు శుక్రవారం ఉద్దానం (Uddanam) సహా ఉత్తరాంధ్ర (Uttarandhra) లోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు జోగారావు స్వగ్రామానికి భారీగా చేరుకున్నారు.
బాతు పురం గ్రామం జన సంద్రంగా మారింది. జోగారావు పాన్థీవ దేహానికి పూలమాల వేసి అరుణాంజలి (Red salute) ఘటించారు. శోకసంద్రంలోని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అమరుల బంధు మిత్రుల కమిటీ ( Committee of Families and Friends of martyrs) ఆధ్వర్యంలో మావోయిస్టు అగ్రనేత జోగారావు అలియాస్ టెక్ శంకర్, అలియాస్ రఘు అంత్యక్రియలు విప్లవ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించారు.
జోగారావు పార్థీవ దేహంపై Body Covered Red Flag) ఎర్రజెండా కప్పి వీరుల ఆశయాలను సాధిద్దాం… కామ్రేడ్ జోగారావు అమర్ రహే అని నినదించారు. జోగారావు మృతదేహాన్ని ప్రత్యేక వాహనం పై గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీతో గ్రామ పొలిమేరలోని బీచ్ సమీపంలోని స్మశాన వాటిక (Burrial Ground ) వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ ఆయన మృతదేహాన్ని విప్లవ సంప్ర దాయాలతో దహన సంస్కారాలు చేశారు. జోగారావు అంతిమ యాత్రలో విప్లవ గీతాలు, విప్లవ నినాదాలతో ఉద్దానంలో విప్లవాల పోరుగడ్డ బాతుపురం (Bathupuram) గ్రామం హోరెత్తింది .
విప్లవ యోధుడు జోగారావుకి అడుగడుగునా అరుణ జోహార్లు అర్పిస్తూఈ అంతిమయాత్ర సాగింది. . జోగారావు ది బూటకపు ఎన్ కౌంటర్ (Fake Encounter) అని ప్రజా సంఘాలు ఆరోపించాయి. విశ్రాంతి న్యాయమూర్తి లతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
మార్మోగిన బాతుపురం..

విప్లవ వీరుడు మెట్టూరు జోగారావు మృతితో అంతిమ యాత్రలో జన నాట్యమండలి కళాకారులు కొర్రాయి నీలకంటూ తదితరులు పాల్గొన్నారు. పార్థీవ దేవాహం వద్ద కళాకారులు పాడిన విప్లవ గీతాలతో (Revolutionary Songs) బాతుపురం పొరుగడ్డ హోరెత్తింది. అంత్యక్రియలు మొదలైన నుండి చివరి మజిలీ వరకు ఆధ్యాంతం విప్ల జోహార్లు అర్పిస్తూ కళాకారులు గీతాలు ఆలపించారు.వారి గీతాలు అందరిని కంట తడి పెట్టించాయి.
పోలీసుల అంక్షలు
బూటకపు ఎన్ కౌంటర్ తో ఉద్దానం విప్లవ వీరుడుని పొట్టన పెట్టుకోవడంతోనే ఆగకుండా, ఆ యోధుడి అంత్యక్రియల్లో కూడా పోలీస్ ఆంక్షలు (Police restrictions) ఏమిటని గ్రామస్తులు ప్రజాసంఘాల నేతలు పోలీసుల్ని ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకి జోగారావు పార్థీవ దేహం బాతుపురం చేరుకుంది. తొలుత గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద జోగారావు పార్థీవ దేహం పెడదామనుకున్నా స్థానికుల ఆలోచనలకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో జోగారావు ఇంటి వద్దనే అంత్యక్రియ కార్యక్రమాలు విప్లవ సాంప్రదాయాలతో సాగాయి.
అనంతరం ఎర్రజెండాలతో, విప్లవ నినాదాలతో గ్రామస్తులు ప్రజాసంఘాల నేతలు ర్యాలీగా వెళుతుంటే కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు అడ్డుకున్నారు. ర్యాలీలో ఎర్రజెండాలు (Red Flags Terminated) తీసేయాలని, లేకుంటే జోగారావు పార్థీవ దేహాన్ని వదలమని ఆయన అడ్డుకున్నారు. దీంతో అంత్యక్రియల్లో ఇటువంటి ఆంక్షలు ఎప్పుడు చూడలేదని, మరణం తర్వాత కూడా ఇటువంటి ఆంక్షలు సరికాదని ప్రజా సంఘాల నేతలకు, ( People Organizations) పోలీసులకు మధ్య వాగ్వివాదం (Skirmish) చోటుచేసుకుంది.
అంతిమ యాత్ర సాగిందిలా…

జోగారావు అంతిమ యాత్రలో (Fallowed All Party Leaders) మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, బాతుపురం సర్పంచ్, రాజాం సర్పంచ్ పిట్ట గీత, అమర వీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అంజమ్మ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, దున్న గోవిందరావు, పుచ్చ దుర్యోధన, మద్దిల ధర్మారావు, వైకుంఠ రావు, లక్ష్మణ రావు, మార్పు వెంకటరమణ, ఈరోతు ఈశ్వరరావు, పులారి తౌటయ్య, వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బెలమర జీవన్, యాదవ సంఘం నాయకులు రాపాక చిన్నారావు, మహిళా సంఘ నాయకులు పోతనపల్లి అరుణ, పోతనపల్లి కుసుమ, నాగమణి పాల్గొన్నారు.

