AP – TN | చేనేత ఉత్పత్తులపై ఏపీ-తమిళనాడు కీలక ఒప్పందం !
చేనేత వస్త్రాల విక్రయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ను విస్తరించేందుకు ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది.
రెండు రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను ఆప్కో, కో-ఆప్టెక్స్ స్టోర్లలో విక్రయించేలా ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఈ ఏడాది రూ.9 కోట్లకు పైగా వ్యాపారమే లక్శ్యంగా నిర్దేశించుకున్నారు.
ఏపీ మంత్రి సవిత, తమిళనాడు మంత్రి గాంధీ సమక్షంలో అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ… ఏపీలో తయారయ్యే చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.