MEDICAL | బాలుడి చికిత్సకు దాతలు సహయం..

MEDICAL | బాలుడి చికిత్సకు దాతలు సహయం..

MEDIACAL | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన దొంతమల్ల మౌనిక నరేష్ లకు కుమారుడు ఆనారోగ్యం బారిన పడటంతో చికిత్స కోసం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చేర్చగా 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కులేని స్థితిలో ఉన్న వీరికి హైదరాబాదులో ఉన్నటువంటి నర్సాపూర్ గ్రామస్తులు ముందుకు వచ్చి జోలె అనే కార్యక్రమంతో జోల పట్టి అర్ధిక సహాయం అర్ధించారు. వీరికి రాష్ట్ర రాజనీతి సంస్ సోషల్ పోస్ట్ టీవీ జనపక్షం సిఈఓ ఎర్రబెల్లి రజనీకాంత్ రావు 25 వేలు,ట్రీట్మెంట్ ఆరేంజ్ హాస్పిటల్ ఎండి విక్రమ్ 15 వేలు,బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్&అగర్వాల్ రూ..10 వేలు, ఇతర వాళ్లు సాయం చేసి మొత్తం1లక్ష 50 వేలు సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో గాండ్ల అశోక్ కుమార్,రాయిశెట్టి సతీష్,బురగడ్డ సందీప్ గౌడ్.పులిశెట్టి సాయి, గాజుల తిరుపతి, గాజుల ఎల్ల గౌడ్, ఆడపు పరమేష్ పాల్గొన్నారు.

బాబును ఆదుకోవాలని తల్లిదండ్రుల ఆవేదన.

దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన దొంతమల్ల నరేష్ మౌనిక దంపతులకు 45రోజులక్రితం బాబు జన్మించాడు బాబుకు ఆరోగ్యం బాగులేదని హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా బాబు కిడ్నీ సమస్య ఉందని 10 లక్షల వరకు ఖర్చులు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు డబ్బులకోసం వేడుకుంటున్నారు,ఎవరైనా దాతలు, అధికారులు, నాయకులు, ముందుకు వచ్చి పసివాడి ప్రాణాలు కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply