GAMES | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహణ కార్యదర్శి ఫిజికల్ డైరెక్టర్ బి.రూప ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 14 సంవత్సరాల లోపు స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలను, జిల్లా స్కూల్ గేమ్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ గౌడ్, బి.గోపాలం బాల బాలికలను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ జిల్లా స్థాయిలో రాణించి జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని వారు తెలిపారు. మారుమూల గ్రామమైన కర్ని పాఠశాలలో జిల్లా స్థాయి టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వహణ.కార్యదర్శి ఫిజికల్ డైరెక్టర్ బీ.రూపను ఈ సందర్భంగా వారు అభినందించారు.
పాఠశాల హెచ్ఎం వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ.. మా కర్ని పాఠశాల విద్యార్థులు మల్లేశ్వరి, శివాని, శశిరేఖ, శివకుమార్ జాతీయ స్థాయిలో ఖో ఖో, సైక్లింగ్, షూటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొనేందుకు కృషిచేసిన ఫిజికల్ డైరెక్టర్ బి.రూపను, బి.గోపాలంను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రంగప్ప, దత్తురాం, డాక్టర్ తిరుపతి, పాఠశాల ఉపాధ్యాయ బృందము పీడీలు, పీఈటీలు సాయినాథ్ వెంకటప్ప, నర్సింలు, వెంకటేష్,డిఆర్. మీనా కుమారి, రేణుక, సౌమ్య, స్వరూప, రాజేశ్వరి, చంద్రకళ, అనిత, జిల్లాలోని 13 మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు.

