Pawan Kalyan | పవర్ స్టార్.. నెక్ట్స్ ఏంటి..?

Pawan Kalyan | పవర్ స్టార్.. నెక్ట్స్ ఏంటి..?

ఆంధ్ర‌ప్ర‌భ, సినిమా స్పెషల్ స్టోరీ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. వీరమల్లు, ఓజీ సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. ఇందులో వీరమల్లు యావరేజ్ గా నిలిస్తే.. ఓజీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రావాలి. ఈ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తన వర్క్ కంప్లీట్ చేశారు.

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ సినిమాలు చేస్తారా..? చేయరా..? చేస్తే.. ఎవరితో చేస్తారు..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. పవర్ స్టార్ నెక్ట్స్ ఏంటి..?

పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేస్తానని ఎప్పుడో ప్రకటించారు. ఈ మూవీ కోసం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు. రామ్ తాళ్లూరి ఈ మూవీకి నిర్మాత. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి.. ఇంకా చెప్పాలంటే.. రిలీజ్ కూడా అయ్యుండాలి.

అయితే.. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడం వలన ఇంత వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. మరో వైపు రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో అసలు ఈ సినిమా ఉంటుందా..? ఉండదా..? అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

అయితే.. ఈమధ్య మళ్లీ ఈ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. పవన్ అంతా రెడీ చేసుకోండి.. డేట్స్ ఇస్తానని చెప్పారట. అయితే.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశీ కలిసి రెండు కథలు రెడీ చేశారట. ఈ రెండు కథల్లో ఏ కథకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ కథతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ తో సముద్రఖని బ్రో అనే సినిమాను తెరకెక్కించడం తెలిసిందే. ఈ సినిమాను సముద్రఖని చాలా తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేశారు. సముద్రఖని వర్కింగ్ స్టైల్ అండ్ స్పీడు నచ్చడంతో పవర్ స్టార్ మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారట.

పవర్ స్టార్ అలా అన్నప్పటి నుంచి మరో కథ పై వర్క్ చేస్తూనే ఉన్నారట సముద్రఖని. ఇప్పుడు స్టోరీ రెడీ అయ్యిందని.. పవన్ కు కూడా ఈ స్టోరీ నచ్చిందని.. ప్రాజెక్ట్ ఫిక్స్ అంటూ ఆమధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల సముద్రఖని ఇచ్చిన ఇంటర్ వ్యూలో.. ఓ పెద్ద సినిమా చేయబోతున్నట్టుగా చెప్పారు కానీ.. ఎవరితో అనేది మాత్రం లీక్ చేయలేదు.

అది.. పవర్ స్టార్ తోనే అని వార్తలు వస్తున్నాయి. అయితే.. పవన్ ఇప్పుడు పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడు డేట్స్ ఇస్తారో..? క్లారిటీ లేదు. నెక్ట్స్ ఇయర్ లో ఖచ్చితంగా పవన్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో ఉన్నది నిజమే అయితే.. సినిమా చేయాలని ఫిక్స్ అయితే.. ముందుగా పవన్ సురేందర్ రెడ్డితో చేస్తారా..? లేక సముద్రఖనితో చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. ఏది ఏమైనా పవన్ నెక్ట్ మూవీ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply