POSTER| భవానిపురం, ఆంధ్రప్రభ: ఈ నెల 26 న రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్ ) ను పురస్కరించుకొని విజయవాడలోని భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. హెచ్ బీ కాలనీ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ జెట్టి రామారావు, సెక్రటరీ దాసరి బుజ్జి, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు వేంపలి గౌరీ శంకర్ , పచ్చవ మల్లికార్జునలతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, రాజ్యాంగం ప్రాముఖ్యతను చాటి చెప్పాలని.. ఈ నెల 26 న సాయత్రం 5 నుంచి 8 గంటల మధ్య భవానిపురం నుంచి ఎంజీ రోడ్ లోని అంబేద్కర్ స్మృతి వనం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హెచ్ బీ కాలనీ షెడ్యూల్డ్ కులముల సంఘం ప్రెసిడెంట్ జెట్టి రామారావు, సెక్రటరీ దాసరి బుజ్జి కోరారు.

