CAR| కారు తగలబెట్టిన నిందితుడి అరెస్ట్…

CAR| సత్యనారాయణపురం, ఆంధ్రప్రభ: అక్టోబర్ 12వ తేదీన వైసీపీ నేత డాక్టర్ పొన్నూరు గౌతమ్ రెడ్డి ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కారును గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు అంటించారని ఇచ్చిన ఫిర్యాదు పై సత్యనారాయణపురం పోలీస్ లు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.వీ.వీ లక్ష్మి నారాయణ, సిబ్బందితో కలిసి పలు బృందాలుగా ఏర్పడి ఘటన జరిగిన ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలలోని సీ.సీ.కెమెరాలను పరిశీలించి అనుమానితుని గుర్తించి, అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం ఇన్పెక్టర్ కి రాబడిన పక్కా సమాచారం మేరకు సత్యనారాయణ పురం ఎస్సై సౌజన్య, వారి సిబ్బందితో కలిసి సత్యనారాయణపురం మట్టిరోడ్డు వద్ద అనుమానిత వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించి క్రైమ్ కు సంబంధించిన నిందితుడిని అరెస్టు చేశారు. హైద్రాబాద్, బండ్లగూడ, హైదర్ షా కోటకు చెందిన హరికోటి లెనిన్ బాబు కాగా.. 2005 కు ముందు విజయవాడ పెజ్జోనిపేట ఏరియాలో నివాసం ఉండేవాడు. వివరాల్లోకి వెళితే.. హరికోటి లెనిన్ బాబు 2005 విజయవాడ నుంచి హైదరాబాదులో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ, పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2005 కు ముందు విజయవాడలో నివాసం ఉండేవాడు. గతంలో ఇతనిపై సత్యనారాయణపురం, కృష్ణలంక, మాచవరం, సూర్యరావుపేట, గవర్నర్ పేట, పీఎం పాలెం మొదలగు పోలీసు స్టేషన్ లలో వివిధ దొంగతనాలు చేసిన 15 కేసులు ఇతని మీద క్రైమ్ సస్పెక్ట్ షీట్ కూడా కలదు. ఇతను రాధా రంగాలకు వీరాభిమాని.

ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం యూట్యూబ్ చూస్తున్న సమయంలో గౌతం రెడ్డి ఒక టి.వి. చానెల్ లో ముఖాముఖి ప్రోగ్రాంలో వంగవీటి రంగాన్ని విమర్శించారు. సదరు విమర్శను చూసి స్వాతహాగా రంగా అభిమాని అయిన ముద్దాయి గౌతంరెడ్డికి ఏదైనా ఆస్తి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో అక్టోబర్ 12వ తేదీన సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వచ్చి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వారి ద్వారా గౌతమ్ రెడ్డి ఇంట్లో లేరని.. తెలుసుకొని సమీపంలో గల పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుక్కోని కార్ వద్దకు వెళ్లి కారు వెనుక నుంచి పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వీడియో గురించి విచారించగా సెప్టెంబర్ 2017 లో ఒక టీవీ షో అని గుర్తించడం జరిగింది. ఆ షోలో గౌతం రెడ్డి రాధా రంగాను కించపరుస్తూ మాట్లాడటం సహించలేక ఈ పని చేశాడని తెలిసింది.

Leave a Reply