THE LAST VIGIL | భ‌ద్రాద్రి కుర్రోడు.. హాలీవుడ్‌లో అరంగ్రేటం

THE LAST VIGIL | భ‌ద్రాద్రి కుర్రోడు.. హాలీవుడ్‌లో అరంగ్రేటం

  • ద‌ లాస్ట్ విజిల్ తో తెలంగాణ వాసి తొలిఅడుగు
  • లాస్ట్‌ విజిల్‌ అనే చిత్రానికి వివేకానంద ద‌ర్శ‌క‌త్వం

THE LAST VIGIL | భద్రాచలం, ఆంధ్ర‌ప్ర‌భ : భ‌ద్రాద్రి కుర్రోడు.. హాలీవుడ్‌లో అరంగ్రేటం చేశాడు! తెలంగాణ (TELANGANA) బిడ్డ త‌న ప్ర‌తిభ చాటుకుని హాలీవుడ్‌లో తొలి అడుగులు వేశాడు. భద్రాచలం శిల్పినగర్‌ కాలనీకి చెందిన రిటైర్డు ఎస్ఐ కొండపల్లి మహేశ్ కుమారుడు వివేకానంద (VIVEKANANDA) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్నద‌ లాస్ట్ విజిల్ (THE LAST VIGIL) అనే సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేసి యూట్యూబ్‌లో పెట్ట‌గా రెండు రోజుల్లో మూడు ల‌క్ష‌ల మంది చూశారు.

భ‌ద్రాద్రి ఏజెన్సీ నుంచి హాలీవుడ్ డైరెక్ట‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు ప‌రిచ‌యం కాబోతున్నాడు కొండ‌ప‌ల్లి వివేకానంద‌. ఆయ‌న‌ దర్శకత్వం వహించిన ద‌ లాస్ట్ విజిల్ అనే ఆంగ్ల చిత్రం 2026 కు(English film to 2026) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్‌లో రెండు చిన్న‌ చిత్రాలకు దర్శకత్వం వహించి మన్ననలు అందుకున్నారు.

ఈ అనుభ‌వంతో బ్రేట్ క‌లెన్‌, కేథ‌రిన్ వంటి న‌టుల‌తో ద లాస్ట్ విజిల్ అనే చిత్రాన్ని రూపొందించారు. 95 నిమిషాల నిడివిగల ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక విలువలతో దాదాపు 1.3 మిలియన్‌ డాలర్లు (సుమారు 11.48 కోట్లు) వెచ్చించి చిత్రీకరించారు. టాలీ వుడ్‌లో వివేక్ తుల అనే తెలుగు లఘు చిత్రానికి మాటలు కూడా అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో(300 theatres) క్రిస్మస్‌కు విడుదల చేయాలని భావిస్తున్నాం అని వివేకానంద తెలిపారు. త్వరలో మరో హాలీవుడ్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అంశం చర్చల దశలో ఉంది. ఇది పూర్తయ్యాక తెలుగు చిత్రానికి దర్శకత్వం చేయాలని ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.

భద్రాచలం శిల్పినగర్‌ కాలనీకి చెందిన రిటైర్డు ఎస్ఐ కొండపల్లి మహేశ్‌, జమునారాణి(Mahesh, Jamunarani) పెద్ద కుమారుడు వివేకానంద. ఇంటెలిజెన్స్‌ ఎస్సైగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన తండ్రి మహేశ్‌ స్వతహాగా గాయకుడు. తండ్రి స్ఫూర్తితో పాటలు పాడటం, కథలు రాయడం అలవాటుగా మార్చుకున్న వివేక్ హాలీవుడ్‌పై దృష్టి పెట్టాడు.

భద్రాచలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్య అభ్యసించిన వివేకానంద, ఇక్కడే ఇంజనీరింగ్ విద్యను కూడా పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసిన ఆయన కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు.

న‌ట‌న పై మ‌క్కువ ఉన్న వివేక్ న్యూయార్క్‌(New York)లోని ఓ చిత్ర సంస్థ‌లో శిక్ష‌ణ పొందాడు. ఆ అనుభవంతో అక్కడి నటీనటులకు కథలు వినిపించారు. ఈ క్రమంలో వారిని మెప్పించి ల‌ఘు చిత్రాలు తీయ‌డం ప్రారంభించారు. భ‌ద్రాద్రి నుంచి హాలివుడ్ వ‌ర‌కూ వివేకానంద ప్ర‌యాణం ఇలా సాగింది.

ఇటీవ‌ల భ‌ద్రాచ‌లం(Bhadrachalam) వ‌చ్చిన వివేకానంద అనేక విష‌యాలు మాట్లాడారు. హాలీవుడ్ లో శిక్ష‌ణ పొందిన ఆయ‌న మాతృభాష అయిన తెలుగులో కూడా సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న ఉన్న‌ట్లు తెలిపాడు. త్వ‌ర‌లో టాలీవుడ్ లో కూడా చిత్రాలు తీస్తాన‌ని చెప్పాడు.

Leave a Reply