GADKARI | ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు

  • వేడుకలలో పాల్గొని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
  • సత్యసాయి మహాసమాధి దర్శించుకున్న గ‌డ్క‌రీ

GADKARI | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి సేవ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్క‌రీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన మహా సమాధిని దర్శించుకుని పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంత‌కుముందు విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి ఘనంగా ఆత్మీయ స్వాగతం ప‌లికారు. బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రభుత్వ రవాణా ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి కృష్ణ బాబు, కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, 13వ నెహ్రు యువ కేంద్ర జాతీయ వైస్ చైర్మన్, బీజేపీ నాయకులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.

Leave a Reply