- పాల్గొన్న ప్రముఖులు
HOMAM|ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో శ్రీ నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో దిగువ అహోబిలంలో శ్రీ స్వాతి సుదర్శన హోమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో దిగువ అహోబిలం జనసంద్రమైంది. ఈ స్వాతి హోమంలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఏపీ డీసీఎం ఎస్ చైర్మెన్ వడ్రాణం హరిబాబు నాయుడులు ముఖ్య అతిథులగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారి వేట ఉత్సవాలను గురించి ఆలయ పండితులు వారికి వివరించారు.

