Hyderabad | రుణమాఫీ కోసం గాంధీ భవన్ వద్ద రైతు ధర్నా
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తనకు రైతు రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. గాంధీభవన్ వద్ద నేడు తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన తోట యాదగిరి మెట్లపై కూర్చోని ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, తనకు మాత్రం రుణమాఫీ కాలేదని తెలిపారు. తనకు రూ.3 లక్షలకు పైగా క్రాప్‌లోన్ ఉందని, కానీ రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తనకు ఎలాంటి పింఛన్, ప్రభుత్వ సాయం, వడ్ల బోనస్ కూడా రాలేదని తెలిపారు.