HEALTH |104 ద్వారా మెరుగైన వైద్య సేవలు

- డాక్టర్ లీషా
HEALTH | ఉండి, (ఆంధ్రప్రభ) : చంద్రన్న సంచార చికిత్స కేంద్రం 104 ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ లీషా అన్నారు. బుధవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో 104 ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా లీషా మాట్లాడుతూ.. ఉండి-2 ద్వారా ప్రతినెలా మొదటి శుక్రవారం సబ్ సెంటర్ కార్యాలయంలో వైద్య సేవలు అందిస్తున్నామని, అలాగే నెలలో మూడవ బుధవారం నెల చివరి 29వ తేదీన కూడా ఇరిగేషన్ కార్యాలయంలో ఈ వైద్య సేవలు మరింత విస్తృతం చేస్తున్నామని అన్నారు.
ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు, గర్భిణులు, బాలింతలు, అలాగే గృహ సందర్శన, అంగన్వాడీ స్కూల్స్, ప్రాథమిక పరిషత్తు స్కూల్ తో పాటు ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌సీ కుమారి, ఎంఎల్‌హెచ్‌పీ స్పందన, 104 డీఈవో రాపాక విజయ్ కుమార్, ఏఎన్ఎం. సీహెచ్ అనూష, హెల్త్ అసిస్టెంట్ జి. వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, 104 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
