22 Carats | పుత్తడి ప్రియులకు గోల్డెన్ ఆఫర్!
22 Carats | భారీగా తగ్గిన బంగారం ధరలు..
22 Carats Gold |వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగారం ధరలు ఒక్కసారి తగ్గాయి. బంగారం (Gold) ధరలు భారీగా తగ్గడంతో పుత్తడి ప్రియులకు గోల్డెన్ ఆఫర్ లభించినట్లయింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కట్‌లో బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 1,23,660 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.1.14 లక్షల వద్ద కొనసాగుతోంది. గత వారం బంగారం ఎంత పెరిగిందో.. మళ్లీ ఇప్పుడు అంతే స్థాయిలో తగ్గింది. నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,25,400 కాగా.. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,660 వద్ద ఉంది. అంటే పది గ్రాముల వద్ద రూ. 1740లు తగ్గింది. అలాగే నిన్న 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,14,950 ఉండగా.. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,350 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై ఒక్కసారిగా రూ. 1600 తగ్గింది.
22 Carats |ఐదు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం
బంగారం ధరలు ఐదు రోజుల్లో ఐదు వేల రూపాయలు తగ్గింది. ఈనెల 13వ తేదీన 10 గ్రాముల పసిడి రూ.1.30 లక్షల వద్ద ఉంది. ఐదు రోజుల వ్యవధిలో రూ. 5 వేల మేర తగ్గింది. అప్పట్లో అంతర్జాతీయంగా (Internationally) ఔన్సు బంగారం 4200 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు 4010 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా బంగారానికి, అమెరికాలోని వడ్డీ రేట్లకు సత్సంబంధం ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెల ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు క్షీణించడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. దీనికితోడు డాలర్ ఇండెక్స్ బలపడడమూ మరో కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు.
+ హైదరాబాద్‌లో 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,660, కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,350 వద్ద కొనసాగుతోంది.
+ విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,350 వద్ద ఉంది.
+ విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,660 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,350 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,810 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,13,500 వద్ద ఉంది.
22 Carats | వెండి ధరలు ఇలా ఉన్నాయి..
వెండి ధరలు (Silver Prices) కూడా ఈ రోజు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చకుంటే ఈ రోజు మూడు వేల రూపాయలు తగ్గింది. నిన్న కిలో వెండి ధర రూ. 1,73,000 కాగా, ఈ రోజు కిలో వెండి ధర రూ.1,70,000 వద్ద పలుకుతోంది. ఈ రోజు కేజీ సిల్వర్ పై రూ.3,000 తగ్గింది. ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,62,000 వద్ద కొనసాగుతోంది.
22 Carats | తగ్గిన గోల్డ్ ధరలు

