Sangareddy | నక్క వాగులో ఇసుక దొంగలు..
సంగారెడ్డి, (ఆంధ్రప్రభ):సంగారెడ్డి మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ శివారులో గల నక్క వాగులో బ్యాతోల్ తాండాకు చెందిన వ్యక్తులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసినట్లు సంగారెడ్డి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.
నక్క వాగు వద్ద నిబంధనల విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేసి రెండు ట్రాక్టర్లు, ఒక హిటాచి వాహనం, మూడు బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసే దర్యాప్తు జరుపుకున్నట్లు తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాకు తోడ్పడుతున్న వ్యక్తులు పారిపోయారని అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని సంగారెడ్డి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.