Mulugu | దారుణ హత్య

Mulugu | దారుణ హత్య
ఎలక్ట్రిషియన్ కొట్టి చంపిన దుండగులు
Mulugu | ములుగు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఏటూరునాగారానికి చెందిన ఓ ఎలక్ట్రిషియన్ (Electrician)ను గుర్తు తెలియని దుండగులు కట్టేసి కొట్టి చంపారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఏటూరునాగారం మండలానికి చెందిన సమ్మయ్య (sammaiah) (40) ఎలక్ట్రిషియన్ మోటారు బిగించడానికి పని నిమిత్తం ఈ రోజు ఇంటి నుంచి బయలుదేరిన సమ్మయ్య, ములుగు మండలంలోని లాలాయగూడ గ్రామానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలోనే దుండగులు సమ్మయ్య (sammaiah) ను బంధించి, కట్టేసి దారుణంగా కొట్టి చంపినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే లాలాయగూడకు చేరుకున్నారు. ధ్వంసమైన బైక్, ఇంటికి తాళం ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు (police) ప్రాథమిక విచారణలో భాగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రదేశంలో పగిలిపోయిన గాజులు (చేతి గాజులు) లభ్యమయ్యాయి. దీని ఆధారంగా హత్య వెనుక మహిళల హస్తం ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలు (వ్యక్తిగత కక్షలు లేదా ఆస్తి తగాదాలు) ఏమై ఉంటాయి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి చిత్తూరులో ఘోర ప్రమాదం
