Bhatti Vikramarka | దుండిగ‌ల్ లో గ్లోబ‌ల్ స‌మ్మిట్ స్థ‌ల ప‌రిశీల‌న‌

Bhatti Vikramarka | దుండిగ‌ల్ లో గ్లోబ‌ల్ స‌మ్మిట్ స్థ‌ల ప‌రిశీల‌న‌

8,9 తేదీల్లో స‌మ్మిట్‌


Bhatti Vikramarka | కుత్బుల్లాపూర్( హైదరాబాద్ సిటీ), ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణను పెట్టుబడుల స్వర్గ ధామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్ (Hyderabad) లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. రాష్ట్రాన్ని ఒక ప్రధాన ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా ప్రొజెక్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Global Summit 2025) ను నిర్వహిస్తోంది.

ఈ సమ్మిట్‌లో పారిశ్రామిక‌వేత్త‌లు, ప్రపంచ పెట్టుబడిదారులు, ఐటీ నిపుణులు, దౌత్యవేత్తలు సహా 1,300 మందికి పైగా పాల్గొంటారని భావిస్తుండగా ఇందు కోసం భారీ ఎత్తున స్థల సేకరణ చేస్తున్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో స్థల సేకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ లో సర్వే నెంబర్ 453, 454లోని 574 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడటంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సోమవారం స్థల పరిశీలనకు వచ్చారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి (Collector Manu Chaudhary), టీజీఐఐసీ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దుండిగల్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు స్థల పరిశీలన స్థలానికి భారీ ఎత్తున చేరుకున్నారు. తొలుత కలెక్టర్ మను చౌదరి స్వాగతించగా అనంతరం మేడ్చల్ జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, దుండిగల్ మాజీ సర్పంచ్ గణేష్ తదితరులు డిప్యూటీ సిఎం బట్టికి శాలువా కప్పి స్వాగతించారు.

Leave a Reply