Bikkanoor | వరిగడ్డి వితరణ…
Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూరు (Bikkanoor) మండల కేంద్రంలో గల సిద్ధి రామేశ్వర ఆలయంలోని గోషాలకు పలువురు రైతులు సోమవారం వరిగడ్డి వితరణ చేశారు. గోశాలలో ఉంటున్న గోమాతల కోసం రైతులు (farmers) ఉచితంగా వరిగడ్డిని అందజేశారు.
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన రైతులు (farmers) వెంకటరెడ్డి, నరసింహులు తమ వంతుగా 65 కట్టల వరిగడ్డిని ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చి గోశాలలో వేశారు. వాటిని గోమాతలకు ఆహారంగా అందించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. సిద్ధిరామేశ్వర స్వామి (Siddhi Rameshwara Swamy) ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

