Jubilee Hills | నవీన్ కు కీలక పోస్టు..
Jubilee Hills అధిష్టానం గ్రీన్ సిగ్నల్..
- కేబినెట్, సీఎల్పీ భేటీ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం..
Jubilee Hills హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీ హిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో విజయదుందుభి మ్రోగించిన తర్వాత ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ కు (Naveen Yadav) కాంగ్రెస్ పార్టీలో (Congress Party) ఊహించని గుర్తింపు దక్కింది. అదికాస్తా ఏఐసీసీ (AICC) అధిష్టానం పెద్దల వరకూ చేసింది. కలిసొచ్చిన సమయం.. ప్రభుత్వంలో కీలక పదవి వరిస్తుందని పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నవీన్ యాదవ్ కు ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో గవర్నమెంట్ విప్ లేదా కేబినెట్ హోదాలో కార్పొరేషన్ పదవి వస్తుందని ఆయన అనుచర వర్గం భావిస్తోంది. తాజాగా ఢిల్లీ (Delhi) వెళ్లిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రతిపాదనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్, సీఎల్పీ భేటీ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బై ఎలక్షన్లో దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. తన 16 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైమ్ విక్టరీ కొట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టనుందని చర్చ నడుస్తోంది. నవీన్ యాదవ్ (Naveen Yadav) తొలిసారిగా 2009లో ఎంఐఎం నుంచి యూసుఫ్గూడ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ (Maganti Gopinadh) చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2015లో మరోసారి ఎంఐఎం (MIM) అభ్యర్థిగా రహ్మత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి బరిలోకి దిగి 18,817 ఓట్లతో సరిపెట్టుకున్నారు. తర్వాత 2023లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ (Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తొలిసారిగా విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయంతో నవీన్ యాదవ్ (Naveen Yadav) ప్రభుత్వంలో పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ నేతల నుంచి, విశ్లేషకుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ముగ్గురు ప్రభుత్వ విప్లు ఉండగా.. మరో నలుగురిని నియమించుకునే అవకాశం ఉంది. బీసీ (BC) సామాజికవర్గానికి చెందిన ఆయనకు పదవి ఇచ్చేందుకు సీఎం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ (Azharuddin) కు మంత్రి పదవి ఇవ్వడంతో.. మరొకరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని విప్ పదవి ఇచ్చేందుకు అదిష్టనం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ (Hyderabad) పరిధిలో యాదవ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. గ్రేటర్ పరిధిలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో లేరు. నవీన్ యాదవ్ ఎన్నికవడంతో సమీకరణాలు కలిసి రానున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://epaper.prabhanews.com

