DRUSHYAM 3 : వీడిన కుప్పం మర్డర్ మిస్టరీ

DRUSHYAM 3 : వీడిన కుప్పం మర్డర్ మిస్టరీ
- రుణ గ్రస్తుడి ఇంటిలో ఫైనాన్సర్ శవం
- సెల్ ఫోన్ ట్రాక్ తో తెలిసిన బాడీ జాడ
- రూ.40లక్షలకు ఎగనామం.. ఆపై హత్య
- పరారీలో ప్రధాన నిందితుడు ప్రభాకర్

( చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో)
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణాన్ని కుదిపేసిన కిరాత హత్య కేసు మిస్టరీ వీడింది. ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు అత్తిబెలే (Attibele) లో నివసించే శ్రీనాథ్ (Srinath) (37) అక్టోబర్ 27 నుంచి కనిపించలేదు. కర్ణాటకలో (Missinig case) మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శ్రీనాథ్ మొబైల్ ఫోన్‌ను ట్రాక్ (Mobile track) తో.. కర్ణాటక పోలీసులు అతడు చివరిసారి కుప్పం (Kuppam ) పరిసరాల్లోనే ఉన్నట్లు గుర్తించారు. విచారణలో రామకుప్పం మండలం ముద్దునపల్లి (madduna palli) కి చెందిన ప్రభాకర్ (Prabhakar) ను పోలీసులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
DRUSHYAM 3 : నిజం కక్కాడిలా..

అంతే అసలు కథను ప్రభాకర్ వెళ్లగక్కాడు. శ్రీనాథ్‌తో ప్రభాకర్‌కు ఆర్థిక లావాదేవీల (Finance ) వివాదం ఉంది. బెంగళూరు (Bengalure) లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న శ్రీనాథ్ ప్రభాకర్‌కు రూ.40 లక్షలు (Rs, 40 Lakhs( అప్పుగా ఇచ్చాడు. వారం రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ప్రభాకర్ గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బు ఇవ్వలేదు. పైగా తప్పించుకు తిరుగుతున్నాడు.
DRUSHYAM 3 : అప్పు వసూలుకు వస్తే..
అప్పు వసూలుకు (Loan Recovery) శ్రీనాథ్ తరచూ కుప్పంకు రావడంతో తనపై ఒత్తిడి పెరుగుతోందని భావించిన ప్రభాకర్ అతడిని హత్య చేయాలని (Murder plan) పన్నాగం పన్నాడు. తన స్నేహితుడు గిరిదలతో కలిసి హత్యకు వ్యూహ రచన చేశాడు. అక్టోబర్ 27న కుప్పం వచ్చిన శ్రీనాథ్‌ను ప్రభాకర్ మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో దారుణంగా హత్య చేశాడు.
DRUSHYAM 3 : శవం పూడ్చి ..
హత్య అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమా తరహాలో ప్రణాళిక రచించిన ప్రభాకర్, కుప్పం మున్సిపాలిటీ (Kuppam )పరిధిలోని జగనన్న కాలనీలో (Jagananna Colony) కొత్తగా నిర్మించిన, తన ఇంటిలో (in House) గుంత తవ్వి మృతదేహాన్ని ( Body Burried) పూడ్చిపెట్టాడు. అనంతరం ఇంటిని బయట నుండి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఘటన స్థలంలో దుర్వాసన రావడం స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులు ఆరా తీయగా ( CCTV Puttage) సీసీ కెమెరాల్లో శ్రీనాథ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు బయటపడటంతో కేసు మలుపు తిరిగింది.
DRUSHYAM 3టెక్నాలజీతో పట్టివేత

కర్ణాటక, ఏపీ పోలీసులు సంయుక్త దర్యాప్తులో (Drushyam style) కీలక ఆధారాలు సేకరించారు. జగనన్న కాలనీలోని ఇంటి వద్ద తవ్వకాలు చేయగా పూడ్చిపెట్టిన (Srinath Body ) మృతదేహాన్ని వెలికి తీయడానికి పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు. గతంలో కూడా ప్రభాకర్ ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో బయటపడింది. తన చిన్నాన్న కొడుకే తమ కుటుంబ సభ్యుడిని హత్య చేసి పూడ్చిపెట్టాడన్న విషయం తెలుసుకున్న శ్రీనాథ్ బంధువులు షాక్‌కు గురయ్యారు. అప్పు వివాదం చివరకు ప్రాణాంతకంగా మారడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
DRUSHYAM 3కుప్పంలో టెన్షన్ ..
కుప్పం పట్టణంలో ఈ విషయంపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడు ప్రభాకర్ ప్రస్తుతం (Prabhakar Escaped) పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. కేసులో ఇంకా మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
