Anantgiri | చెత్తా చెదారంతో కంపు కంపు…
Anantgiri | వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఊటిగా ఉన్న అనంతగిరిలో ఇటీవల మెడికల్ కళాశాల(Medical College) ఏర్పాటుతో పాటు కార్తీకమాస జాతర సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు రావడంతో ఈ ప్రాంతమంతా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల(plastic waste material)తో నిండిపోయింది. సహజంగా అనంతరికి వస్తే ప్రశాంతత ఉంటుందన్న భావనకు భిన్నంగా ఈ రోజు మాత్రం ప్లాస్టిక్‌తో అనంతగిరి పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.
ప్రధానంగా దేవాదాయశాఖ(Department of Religion), మున్సిపల్ శాఖ అటవీ శాఖ, పర్యాటకశాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించే నాధుడే లేడు. దీనికి తోడు నూతనంగా మెడికల్ కళాశాల ఏర్పడుతూ ఈ ప్రాంతమంతా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కనిపిస్తున్నాయి.

