Accident | రోడ్డు ప్రమాదం…

Accident | రోడ్డు ప్రమాదం…
Warangal | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ జిల్లా వరంగల్ – హైదరాబాద్(Warangal – Hyderabad) జాతీయ రహదారి నిడిగొండ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం వరంగల్ – హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి సమీపం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీ(sand lorry) నెంబర్ TG7uk5469ని వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు నెంబర్ TG03Z0046 గల బస్సు అతివేగంగా, బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.
ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన జనగామ జిల్లా ఆస్పత్రి(Janagama District Hospital)కి తరలించారు. మృతులు దుండిగల్‌కు చెందిన పూలమాటి ఓం ప్రకాష్, హనుమకొండకు చెందిన నవదీప్ సింగ్‌గా గుర్తించారు.
