Bhiknur | కార్తీక దీపోత్సవం..

Bhiknur | కార్తీక దీపోత్సవం..

Bhiknur, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు (Bhiknur) మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయంలో ఈ నెల 18న కార్తీకదీపం నిర్వహిస్తున్నట్లు సిద్ధి రామేశ్వర భజన మండలి అధ్యక్షులు శని శెట్టి రాజలింగం తెలిపారు. కార్తీక మాసం (karthika masam) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో సాయంత్రం ఐదు గంటలకు జరిగే కార్తీకదీపంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

దీపోత్సవం (Deepotsavam)లో పాల్గొనే భక్తులకు దీపాలు, వత్తులు, నూనె ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి సిద్ధిరామేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని ఆయన సూచించారు. కార్తీక దీపోత్సవానికి కమిటీ సభ్యులైన కొడిప్యాక ఆంజనేయులు, సిద్దా గౌడ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

Leave a Reply