సర్‌కు సన్నాహాలు

- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు చర్యలు
- క్షేత్రస్థాయి నుంచి నిశిత పరిశీలన శ్రీ స్థానిక ఎన్నికలకు కొత్త జాబితా
- ఏర్పాట్లలో ఈసీ.. పరిస్థితిని సమీక్షించిన సీఈవో సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధి కారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో సీఈవో సుధర్శన్‌రెడ్డి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వచ్చే నెల నుంచి ఎస్‌ఐఆర్ (సర్)ను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రిపరేటరీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిని పర్యవేక్షించేందుకు, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సమస్యలను పరిష్క రించడానికి సీఈవో సి.సుదర్శన్ రెడ్డి శనివారం తెలంగాణలోని అన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఓటరు జాబితా సవరణల స్థితి, క్లెయిమ్‌లు, అభ్యంతరాల తొలగింపు, క్షేత్ర స్థాయి నుంచి నివేదికల సమర్పణపై ఆయన సమీక్షించారు. ఖచ్చితమైన డేటా ఎంట్రీ, సత్వర క్షేత్ర ధృవీకరణ, తప్పులులేని రీతిలో జాబితాల రూపకల్పనపై కీలక ఆదెశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా సవరణలు, ముద్రణా పురోగతి సమయంలో పెండింగ్‌లో ఉన్న పనిని వేగవంతం చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సీఈవో హరి సింగ్, ప్రధాన ఎన్ని కల అధికారి కార్యాలయం నుండి సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం నేపథ్యంలో ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా తయా రీపై దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాను వార్డుల వారీగా రూపొం దించనున్నారు. గతంలో 10,78,324 మంది ఓటర్లు ఉండగా, మార్పులు, చేర్పులతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తుది జాబితా రూప కల్పనకు ఎన్నికల సంఘం ప్రాధాన్యతనిస్తోంది. ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శ కతను పెంచుతుంది. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఈవో కార్యాచరణ చేస్తుండగా, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లను వేగ వం తం చేసింది. ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీపై ప్రత్యే కంగా దృష్టి పెట్టింది.
తెలంగాణలోని జిల్లా కలెక్టర్లకు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల కోసం కొత్తగా ఓటర్ల జాబితాను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ తయారు చేస్తున్నారు.
గతంలోనే రెండుసార్లు పంచాయతీ ఎన్నికల కోసం జాబితాను రూపొందించి.. ఎంపీ డీవోల లాగిన్ ద్వారా టీపోల్ పోర్టల్‌లో నమోదు చేశారు. అయితే.. పంచా యతీలు, వార్డుల సంఖ్య లో మార్పులు (పెరగడం లేదా తగ్గడం) చోటుచేసు కున్న నేపథ్యంలో.. మళ్లీ ఒకసారి జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది.
పాత జాబితా తయారు చేసి ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగిస్తున్నారు. అదేవిధంగా.. ఈ మ ధ్య కాలంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిని వారి కుటుంబ సభ్యుల పోలింగ్ బూత్ పరిధిలో చేరుస్తారు. దీంతో గతంలో కేటాయించిన జాబితా సీరి యల్ నంబర్లు మారే అవకాశం ఉంది. పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వార్డుల వారీగా మళ్లీ జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం
2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ ఓటర్ల జాబితాను మార్చిలో విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలు గడిచింది. ఈ కాలంలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. వారికి కూడా పంచాయతీ ఎన్ని కల్లో ఓటు హక్కు కల్పించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో.. ఎన్నికల సంఘం మళ్లీ తుది జాబితా రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దీని ఫలితంగా ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. తాజా జాబితా తయారీ తర్వాత ఈ సంఖ్యలలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ తీసు కుంటున్న ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియ పారదర్శ కతను, విశ్వసనీయతను పెంచనున్నాయి.
