Atchampet | సీపీఐ 2వ బస్సు జాతను విజయవంతం చేయాలి

Atchampet | సీపీఐ 2వ బస్సు జాతను విజయవంతం చేయాలి
Atchampet | అచ్చంపేట, ఆంధ్రప్రభ : భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర 100 సంవత్సరాలు ముగింపు ఉత్సవాల సందర్భంగా రెండవ బస్సు జాత విజయవంతంగా చేయాలని అచ్చంపేట నియోజకవర్గం కార్యదర్శి పేర్ముల గోపాల్(Permula Gopal) ఈ రోజు కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు సందర్భంగా అచ్చంపేట పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఎం. బాల నరసింహ(Comrade M. Bala Narasimha), ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో డిసెంబర్ 26న 2025 భారీ బహిరంగ సభ, ఖమ్మం పట్టణంలో రెండవ బస్సు జాతను నిర్వహించడం జరుగుతుందని, సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు ఇట్టి బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రెండవ బస్సు జాత ఈరోజు (15) గద్వాల్ జిల్లా(Gadwal District) జాత ప్రారంభమై 17న నాగర్ కర్నూల్ జిల్లాలోకి రావడం జరుగుతుందనీ, అందులోనే భాగంగా 17న మూడు గంటలకు అచ్చంపేట నియోజకవర్గానికి జాత ఆచ్చంపేట్ బస్టాండ్ దగ్గరకి రావడం జరుగుతుందన్నారు. అనంతరం జాత డిండి మీదుగా కొత్తగూడెం జిల్లాకు 21న చేరుకుంటుందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఇప్పటికీ ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల(Poor Badugu Weak Sections) ప్రజల కోసం నిరంతరం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అండగా ఉంటూ ఎన్నో సేవలు, పోరాటాలు చేస్తూ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గోరేటి నరేష్, కృష్ణ, రాజు, మంజుల, లాలయ్య, చిట్టమ్మ, నరేష్, స్వామి, శాంతమ్మ, దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి Pawan Kalyan |డిప్యూటీ సీఎం విజిలెన్స్
