Narayanapet | గుర్తుతెలియని మృతదేహం కలకలం
Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ హద్దుల్లోని అప్పక్‌పల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఈ రోజు కనిపించడం స్థానికులలో కలకలం రేపింది. ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో గ్రామస్థులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక పరిశీలనలో మృతుడి వయస్సు 30–40 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని, దాదాపు 10–15 రోజుల క్రితమే మరణించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
శరీరంపై ఎలాంటి గుర్తింపు కార్డులు(Identity Cards), వస్తువులు లభించకపోవడంతో మృతుని వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని నారాయణపేట రూరల్ ఎస్ఐ రాముడు(SI Ramadu) విజ్ఞప్తి చేశారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : పిఎస్: 8712670417, సీఐ – నారాయణపేట : 8712670383, శవం గుర్తింపు, మరణానికి దారితీసిన కారణాలు తెలుసుకునేందుకు కేసును రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

