రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించిన ఆలేరు విద్యార్థి….

నెల్లికుదురు, (ఆంధ్రప్రభ): ఎస్జీఎఫ్ 69వ అండర్-17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన విద్యార్థి బానోతు సాయి చరణ్ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 8 నుండి 10 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల్ల బయ్యారంలో జరిగిన పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీమ్ తరఫున మాత్రమే కాకుండా, ఆ జట్టుకు ప్రతినిధిగా కూడా సాయి చరణ్ పాల్గొన్నట్లు మండల విద్యా శాఖ అధికారి ఏ. రాందాస్ తెలిపారు.

ఈ పోటీల్లో వరంగల్ జిల్లా జట్టు మూడోస్థానం సాధించినట్లు ఆయన చెప్పారు. సాయి చరణ్ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Leave a Reply