Minister 4cr | రూ.4 కోట్ల బడ్జెట్‌తో…
Minister 4cr మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో రూ.48కోట్ల బడ్జెట్‌తో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి(150 bed hospital) నిర్మాణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి పై అక్కడి అధికారులను, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Praja Govt) 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులు కాంట్రాక్టర్లను(contractors) ఆదేశించారు. మంత్రి వెంబడి మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, ఏఈ నాగ శివ, కాంగ్రెస్ నాయకులు బోయ రవికుమార్, గోవర్ధన్ తదితరులు ఉన్నారు.

