Vakiti Srihari | కృషి చేస్తా..

Vakiti Srihari కృషి చేస్తా..

ఊట్కూర్, ఆంధ్రప్రభ – క్రీడాభివృద్ధికి తెలంగాణ (Telangana) ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. క్రీడా మైదానం సర్వే పనులు వేగవంతంగా పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి క్రీడా మైదానం కోసం స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) క్రీడాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రిగా ఈ ప్రాంతంలో క్రీడాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. క్రీడా మైదానానికి మూడు ఎకరాల భూమి కోసం అధికారులు సర్వే చేపట్టి హద్దులు గుర్తించాలని ఆదేశించారు. గత 150 ఏళ్ల నుండి పాత పోలీస్ క్వార్టర్ల వద్ద విద్యార్థులు వివిధ క్రీడలు ఆడుతున్నా సొంత క్రీడా మైదానం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. క్రీడా మైదానం కోసం సర్వే చేపడితే నిధుల మంజూరుకి కృషి చేస్తానని అన్నారు.

క్రీడా మైదానం అన్యాక్రాంతానికి గురవుతుందని బీజీపీ, (BJP) ఏబీవీపీ, (ABVP) బీజేవైఎం నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి క్రీడా మైదానం అన్యాక్రాంతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఆర్డివో రామ్ చందర్ నాయక్, తాహసిల్దార్ చింతా రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, సర్వేయర్, జయశంకర్, పి ఆర్ ఏ ఈ అజయ్ రెడ్డి, ఇన్చార్జి ఎంపివో శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి.యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటీసీ సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ, అరవిందు కుమార్, మాజీ సర్పంచ్ భాస్కర్ తో పాటు అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply