Tiryani | వాకింగ్ చేస్తూ..
తిర్యాణి, ఆంధ్రప్రభ – మండలంలోని విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికునిగా మంగి పిడర్ లో పని చేస్తున్న పర్చాకి మారుతి (38) (Maruthi) ఉదయం వాకింగ్ కి వెళ్లి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మారుతి వాకింగ్ అని వెళ్లి ఎంత సేపటికి రాకపోవడంతో భార్య విజయలక్ష్మి వెళ్లి చూడగా మార్గమధ్యంలో పడిపోయి ఉన్నాడు. దీంతో హుటాహుటిన ఫ్యామిలీ మెంబర్స్ కు, 108 కు సమాచారం అందించి తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మారుతి మృతి చెందినట్లు డాక్టర్ కృష్ణ (Doctor Krishna) తెలిపారు.

