Delhi|ఉగ్రవాదుల టార్గెట్ అదే..

Delhi| ఉగ్రవాదుల టార్గెట్ అదే..

Delhi ఢిల్లీ, ఆంధ్రప్రభ – పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. జేఈఎం మాడ్యుల్స్ కు చెందిన డాక్టర్లు ముజిమ్మల్ గనై, ఉమర్ నబీ ఈ ఏడాది జనవరి మొదటి వారంలో రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో రెక్కీ చేశారు. ఈ రెక్కీలు ఒకసారి కాదు.. 20 రోజుల పాటు చేసినట్టు జమ్ము కాశ్మీర్ (Jammu Kashmir) పోలీసులు దర్యాప్తులో బయటపడింది. ఈ విషయాన్ని మొబైల్ డేటా, సీసీ టీవీ ఫేటేజ్ లు నిర్థారించాయి. భద్రతా దళాల మార్గాలు, గుర్తింపు దారులు, పెట్రోలింగ్ ప్యాటర్న్ లను ఉగ్ర డాక్టర్లు అధ్యయనం చేశారు. రెడ్ ఫోర్ట్ ఒక హై సెక్కూరిటీ ఏరియా. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని (Delhi) అక్కడ నుంచి ప్రసంగిస్తారు.

జనవరి 26న పెద్ద దాడి చేయాలని ప్లాన్ చేశారు. రిపబ్లక్ డే (Republic Day) పరేడ్ మార్గం రాష్ట్రపతి భవన్ (Rastrapathi Bhavan) నుంచి రెడ్ ఫోర్ట్ వరకు ఉంటుంది. వీవీఐపీలు, భద్రతా దళాలు ఎక్కువుగా ఉండే ప్రదేశం. ఇక్కడ ఐఈడీ బాంబులు, వాహనాలతో దాడి చేసి పెద్ద నష్టం కలిగించాలని ఉగ్రవాదులు భావించారు. ముజమ్మిల్ విచారణలో ఇది నిర్ధారణ అయ్యింది. అయితే.. ఆ ప్రాంతంలో జరిగిన భద్రతా ఏర్పాట్లు వలన ఆ ప్లాన్ విఫలమైంది. వారు దీపావళి పండుగ సమయమైన అక్టోబర్, నవంబర్ లో కూడా దాడిని ప్లాన్ బీగా ఉంచారు. అయితే.. భద్రత ఎక్కువుగా ఉన్న కారణంగా తాజా రెడ్ ఫోర్ట్ దాడి హడావిడిగా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply