Congress – వంశీకృష్ణకు ఏఐసీసీ కీలక బాధ్యతలు..

Congress – వంశీకృష్ణకు ఏఐసీసీ కీలక బాధ్యతలు..

అచ్చంపేట, ఆంధ్రప్రభ – కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా, తమిళనాడు రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకుడిగా నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమోదించగా, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కె.సి. వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రాల మద్దతుతో నిర్ణయం తీసుకున్నారు.

డా. వంశీకృష్ణ ఈ బాధ్యతలపై స్పందిస్తూ.. “తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చడంలో భాగస్వామ్యం కావడం నాకు గౌరవంగా ఉందని, ఈ నియామకం పార్టీ నా పై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం” అని తెలిపారు. అలాగే తనను ఈ కీలక బాధ్యతకు ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కె.సి. వేణుగోపాల్, ప్రియాంక గాంధీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో బూత్ కమిటీలు పునర్వ్యవస్థీకరణ, యువత, మహిళల భాగస్వామ్యం పై దృష్టి సారించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.

Leave a Reply