త్వరగా పరిష్కరించాలి

వైద్య పరీక్షలు చేయించుకున్న ఇన్చార్జి పీఓ


ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ జిల్లా ఉట్నూరు సమగ్ర గిరిజన అదిలాబాద్ జిల్లాఅభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ (Yuvraj Marmat) అన్నారు. సోమవారం ఐటిడిఏ ప్రాజెక్ట్అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ… ప్రజావాణి (prajavani) లో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో అదనపు వైద్యశాఖ అధికారి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం సందర్శించి ఔషధాలను పరికరాలను పరిశీలించి పరీక్షలు చేయించుకున్నారు. ప్రజావాణికి వచ్చే ప్రజలందరికీ పరీక్షలు చేయించాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆయా కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమె త మనోహర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ జాదవ్, ఐటీడీఏ తానాజీ జాదవ్, వివిధ శాఖల సంబంధిత అధికారులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply