నితీశ్ కు అగ్ని పరీక్ష..?

నితీశ్ కు అగ్ని పరీక్ష..?

రెండు దశాబ్ధాల పాటు వరుసగా సీఎంగా కొనసాగుతూ వస్తున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్న ఆయన హవా ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందా..? నితీష్ హవాకు బ్రేక్ పడుతుందా..? అనే విషయం పై అందరూ చర్చించుకుంటున్నారు. లాలూ పాలనను జంగిల్ రాజ్ అభివర్ణిస్తూ మార్పు మంత్రాన్ని ప్రయోగించి సీఎం పీఠం ఎక్కిన ఆయన దాదాపుగా రెండు దశాబ్ధాలుగా కొనసాగుతూ వచ్చారు.

2000లో తొలిసారి నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ సమయంలో ఆయన రాష్ట్రంలోని ఏ చట్ట సభలోనూ సభ్యులు కాదు. అయితే అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఎనిమిది రోజుల్లోనే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నితీష్ కుమార్ 2005లో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా ఆయన రాష్ట్రంలోని ఏ సభలోనూ సభ్యునిగా లేరు. ఆతర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆతర్వాత కూడా ఆయన ఎమ్మెల్సీగానే ఎన్నిక అవుతూ సీఎం బాధ్యతలు నిర్వరిస్తున్నారు.

2014, 2015లో తొమ్మిది నెలల స్వల్ప కాలం తప్పా.. 2005 నుంచి నితీష్‌ కుమార్ బీహర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కూటమిలు, రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతూ వచ్చారు. 2020లో మెజార్టీ స్థానాలు బీజేపీకి దక్కినా కూడా ఆయనే సీఎంగా కొనసాగారు. దాదాపుగా 20 ఏళ్లు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డ్ ను ప్రతిపక్ష ఇండియా కూటమి బ్రేక్ వేస్తుందన్న చర్చ జరుగుతుంది.

మొదటి దశలో పొలింగ్ శాతం పెరగడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. మరోవైపు బీజేపీ మాత్రం తమ సీట్లను పెంచుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఎక్కడా అదరకుండా, బెదరకుండా అధికారం మాదే అనే ధీమాను కనబరుస్తుంది. రెండో దశ ఎన్నికల ప్రచారంలోనూ అలానే వ్యవహరిస్తుంది. ప్రచార సభల్లోనే ఏకంగా అధికారంలోకి వచ్చామని తుపాకి రాజ్యం రాదిక అని చెబుతుంది. ఆర్జేడీ మాత్రం విజయం ఖాయం అనే ధీమాతో ఉంది. యువ నాయకుడు తేజస్వీ యాదవ్. సీఎం నితీష్ కుమార్ ను మట్టి కరిపించడం పక్కా అని.. రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నాయి.

Leave a Reply