క‌న‌క‌దాసుకు నివాళి

క‌న‌క‌దాసుకు నివాళి

శ్రీకాకుళం,నవంబర్ 8(ఆంధ్రప్రభ) : భక్త కనక‌దాసు ప్రధాన రచనలు కన్నడంలో ర‌చించిర‌ట్లు ఇన్ చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్త కనసాదాసు 516వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భక్త కనకదాసు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కనకదాసు నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరంగిణి అనే వాటిని రచించినట్లు వివరించారు. నలచరిత్ర, హరిభక్తిసార, తదితర రచనలను కన్నడంలో రచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది, బిసి సంక్షేమ శాఖ అధికారులు, బిసి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply