కోపం క‌ట్ట‌లు తెంచుకుంది

కోపం క‌ట్ట‌లు తెంచుకుంది

రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాల‌ని ఆందోళ‌న‌


మాక్లూర్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని అడవి మామిడిపల్లి (Adivasi Mamidipalli) రైల్వే బిడ్జి పనుల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు శనివారం రోడ్డెక్కారు. ప‌దేళ్లుగా రైల్వే బిడ్జి పనులు కొనసాగుతున్నా ఇప్పటికీ పూర్తి కాక‌పోవ‌డమేంట‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో బ్రిడ్జి పనులు నత్తనడకగా సాగుతున్నాయని మండిప‌డ్డారు. దుమ్ము ధూళితో గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

గ్రామస్తుల ఆందోళ‌న‌తో 63వ జాతీయ రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Heavy vehicles stopped). ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ సమస్య పై దృష్టి సారించాలని కోరారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమంచుకున్నారు. ఇందులో మల్లారెడ్డి, శేఖర్, డి సి గంగారాం, మోతిలాల్, గణపతి, గ్రామస్తులు, తదితరులు పాలొన్నారు.

Leave a Reply