12 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు

12 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు

పెద్దపల్లి ఆంధ్రప్రభ : మతిస్థిమితం లేక కన్నవారిని, సొంత ఊరిని వదిలి వెళ్లిన వ్యక్తి 12 ఏళ్ల త‌ర్వాత తిరిగి వచ్చాడు. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామానికి చెందిన పట్టెం వెంకట రాములు (47) 2013లో కుటుంబ పరిస్థితులు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గ్రామం విడిచి వెళ్లిపోయాడు. వెంకట్ రాములు తల్లి రుకమ్మతోపాటు బంధువులు గ్రామస్తులు ఏళ్ల తరబడి వెంకట రాములు కోసం తీవ్రంగా శ్రమించి ఆశ వదులుకున్నారు.

ఇటీవల అస్సాం నుంచి ఒక హోటల్ యజమాని రంగాపూర్ గ్రామస్తులకు వీడియో కాల్ చేసి వెంకటరాములును చూపించడంతో గుర్తుపట్టిన గ్రామస్తులు మాజీ సర్పంచ్ గంట రమేష్ కు సమాచారం అందించారు. వెంటనే వీడియో కాల్ లో వెంకట్ రాములు ను తల్లి రుక్కమ్మకు చూపించగా కన్నీరు మున్నీరుగా విలపించింది. చివరి శ్వాస విడిచేలోపు తన కొడుకును తీసుకురావాలని వేడుకొంది.

బంధువులకు సర్పంచ్ ఆర్థిక సహాయం అందించి అస్సాం రాష్ట్రంలోని లాఖీం పూర్ జిల్లా భోగినాడు వెంకట రాములు బంధువులు ప్రసాద్, మహేష్ లను పంపించారు. ఆరు రోజులపాటు ప్రయాణం సాగించి వెంకటరాములను శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. 12 ఏళ్ల క్రితం గ్రామం విడిచి వెళ్లిపోయిన వెంకట రాములు గ్రామానికి వచ్చాడని సమాచారం అందుకొని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అత‌డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ట్రైన్ ఎక్కి వెళ్లిపోయానని ఇన్నాళ్లు ఎక్కడెక్కడో తిరిగానని గ్రామానికి రావడం ఆనందంగా ఉందని తెలియజేశాడు. తన కొడుకును చేర్చిన గంట రమేష్ తో పాటు బంధువులకు రుకమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply