ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి

  • జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా మత్స్యశాఖ కార్యకలాపాలను జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాయింట్ సెక్రెటరీ నీతు కుమారి ప్రసాద్ తో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి బ్రాకిష్ వాటర్ ఆక్వా క్లస్టర్ గా పశ్చిమగోదావరి జిల్లాను ప్రకటించినదన్నారు. జిల్లాలో నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాల్లో బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగు జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఆక్వా రైతులకు కల్పించవలసిన మౌలిక సదుపాయాల గురించి కలెక్టర్ చదలవాడ నాగరాణి మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నీతు కుమారి ప్రసాద్ కు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్ ఎల్ ఎన్ రాజు, ఏడి సిహెచ్. రాంబాబు, ఎఫ్డిఓ బి.శరత్, డిపిఎం ఎం.నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply