మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి ఫలితంగా..

మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి ఫలితంగా..

చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఈ సర్వీస్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కొన్ని నెలలుగా చేస్తున్న కృషి ఫలితంగా వందేభారత్ నరసాపురానికి రానుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను నరసాపురం ప్రాంతానికి తీసుకురావడం కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో, రైల్వే ఉన్నత అధికారులతో పలుసార్లు సమావేశమయ్యారు. నరసాపురం ప్రాంతానికి వందేభారత్ రైలు ఆవశ్యకతను తెలియచేశారు.

వందేభారత్ రైలు నరసాపురానికి రావడంతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో పాటు కోనసీమ వాసులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. నరసాపురానికి పొడిగించిన ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్, నరసాపురం స్టేషన్స్ లో ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఆగుతుంది. రైలు నెంబర్ 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి నరసాపురం వరకు, అలాగే రైలు నెంబర్ 20678 నర్సాపురం నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు నడవనుంది.

Leave a Reply