సౌక‌ర్యాలున్నాయా..?

సౌక‌ర్యాలున్నాయా..?

  • స‌కాలంలో కొంటున్నారా?
  • పత్తి కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్

వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి క్రయ విక్రయాలను జిల్లా కలెక్టర్ డా. సత్య శారదా గురువారం పరిశీలించారు. మార్కెట్ యార్డు(Market Yard)లో జరుగుతున్న పత్తి లావాదేవీలను, క్రయవిక్రయాలను ప్రత్యక్షంగా చూసిన అనంతరం మార్కెట్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో నేరుగా రైతుల‌తో నేరుగా మాట్లాడారు.

సౌక‌ర్యాలు ఉన్నాయా, స‌కాలంలో కొంటున్నారా అని రైతుల‌ను అడిగి తెలుసుకున్నారు. పత్తి ధరపై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఏనుమాముల మార్కెట్ యార్డ్‌లో పత్తి తడిసిందని ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా, రైతుల నుంచి ట్రేడర్లు(Traders) కొనుగోలు చేసిన తదుపరి పత్తి తడిసిందని, రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

రైతులకు నష్టం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తగినన్ని టార్పాలిన్లు (తాత్కాలిక కవర్లు) ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ యార్డ్ అధికారులు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి(Sandhyarani), జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్యక్షులు రవీందర్ రెడ్డి,అంజిత్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply