ధాన్యం కొనుగోలు..

ధాన్యం కొనుగోలు..
బిక్కనూర్, (ఆంధ్రప్రభ) రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల కృష్ణ గౌడ్ చెప్పారు. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో వరి కుప్పలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తేమ శాతం పరిశీలించి తక్షణమే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని చెప్పారు. ప్రతి రైతుకు తగిన న్యాయం చేయడం జరుగుతుందన్నారు. సీరియల్ ప్రకారం వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది రేణుక ,భగవంతు రెడ్డి, రైతులు ఉన్నారు.
