బేల కేంద్రంలో విషాదం..!
అదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : బేల మండల కేంద్రంలో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడిపై సిమెంట్ పిల్లర్(Cement pillar) తలపై పడి మృతిచెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. బేల మండల కేంద్రంలోని ఇంద్రానగర్ లో దగ్గరి బంధువుల ఫంక్షన్ కార్యక్రమంలో సిమెంట్ పిల్లర్‌కు కట్టి ఉన్న టెంట్ తాడుతో దవురే వీర్(Davre Veer) (7) అనే బాలుడు సరదాగా ఆడుకుంటుండగా శిథిలంగా ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కుప్ప కూలింది.
పిల్లర్ తలపై పడడంతో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రిమ్స్ ఆస్పత్రి(Rims Hospital)కి తరలిచారు. ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాగా మృతి చెందిన బాలుని తండ్రి చిన్న స్వీట్ షాపులో లేబర్ గా పని చేస్తున్నాడు. పేద కుటుంబంలో పెద్ద కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

